కృష్ణా జిల్లా బాపులపాడు మండలం శాలివాహన కాలనీలోని పుంగునూళ్ల శ్రీనివాసరావు ఇంట్లో చోరి జరిగింది. రాత్రి సమయంలో ఇంట్లో ప్రవేశించి 60 వేల నగదును దుండగులు అపహరించారు. సొత్తు దొంగిలించే క్రమంలో.. ఆరు బయట నిద్రిస్తున్న బాలికకు మెలకువ వచ్చింది. దాడి విషయం బయటకు చెబితే చంపేస్తానని దొంగ బెదిరించాడని బాధితులు తెలిపారు.
బ్యాంకు నుంచి డ్వాక్రా డబ్బులు తీసుకువచ్చి బీరువాలో పెట్టానని శ్రీనివాసరావు భార్య వెంకటలక్ష్మి తెలిపింది. తెలిసినవాళ్లైనా.. లేదా రాత్రి సమయంలో కాలనీలో పేకాట ఆడే వారైనా తీసి ఉంటారని బాధిత కుటుంబం అనుమానం వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి: