ETV Bharat / state

"కరవు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటించాలి" - modi government

రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ స్పష్టత ఇవ్వాలని సీపీఐ నేత రామకృష్ణ కోరారు. గోదావరి, కృష్ణా జలాల పంపిణీపై నిపుణుల సమక్షంలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు.

రామకృష్ణ
author img

By

Published : Aug 31, 2019, 2:18 PM IST

మీడియాతో సీపీఐ నేత రామకృష్ణ

ఆర్ధిక సంక్షోభంతో దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటుపడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవేదన చెందారు. విజయవాడ దాసరి భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. బ్యాంకులను ఎందుకు విలీనం చేస్తున్నారో మోదీ ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. నష్టాలు ఎవరి వలన వచ్చాయో స్పష్టం చేయాలన్నారు. విలీనాన్ని వ్యవతిరేస్తూ బ్యాంకు ఉద్యోగులు చేస్తున్న నిరసనలకు సీపీఐ తరఫున పూర్తి మద్దతు ప్రకటించారు.

రాజధానిపై ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి స్పష్టత ఇవ్వాలని రామకృష్ణ కోరారు. అభివృద్ధి వికేంద్రీకరణకు తాము వ్యతిరేకం కాదని.. రాజధాని అభివృద్ధిని నిలిపివేయడమూ సబబు కాదని అన్నారు. గోదావరి ,కృష్ణా జలాల పంపిణీపై జగన్ మాట్లాడకపోయినా తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. కృష్ణా ,గోదావరి జలాలపై నిపుణుల పర్యవేక్షణలో సమగ్ర చర్చ జరగాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల్లో భరోసా నింపేందుకు కరవు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించాలన్నారు.

Intro:AP_RJY_56_31_KONASEEMA_TIRUPATI_AV_AP10018
తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ :ఎస్ వి కనికి రెడ్డి
కొత్తపేట

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు

Body:7 శనివారాలు నోము నోచుకునే భక్తులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలి రావడంతో ఆలయ ప్రాంగణాన్ని భక్తులతో నిండిపోయాయి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా దేవాదాయశాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది

Conclusion:వేల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు సుమారు 3 గంటల సమయం పడుతోంది ఇక్కడ వచ్చిన భక్తులకు దేవాదాయశాఖ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించింది
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.