అంపన్ తుపాను ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున చేసిన వినాశనం బాధ కలిగించిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ప్రాణాలు కోల్పోవడంతో పాటు వేలాదిమంది నిరాశ్రయులయ్యారన్నారు. అంతకుముందు, హుద్ హుద్ తుఫాను ఉత్తర ఆంధ్రాను అతలాకుతలం చేసిందని, ఆ సమయంలో ప్రజలు ఒకరికొకరు అండగా నిలిచారని గుర్తు చేసారు. ప్రభుత్వ సహకారంతో వారు తమ జీవితాలను తలకిందులుగా చేసిన ప్రకృతి విపత్తు పరిణామాలను అధిగమించగలిగారని వెల్లడించారు. అంపన్ బాధిత రెండు రాష్ట్రాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలు తమ తమ ప్రభుత్వాలు, కేంద్రం నుంచి వచ్చే మద్దతుతో సకాలంలో కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. వారికి తమ వంతు ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఇవీ చదవండి