ముస్లిం సోదరులకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు మొహర్రం శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని మొహర్రం గుర్తు చేస్తుందని ఆయన అన్నారు. మహ్మద్ ప్రవక్త ధర్మం కోసం అన్యాయాలు, అక్రమాలను నిరసించారన్నారు. మొహర్రం పండగను తెలుగు ప్రాంతాల్లో పీర్ల పండగగా జరుపుకుంటారని,.. రాష్ట్రంలో మొహర్రం పండుగను ముస్లింలే కాక అన్ని వర్గాల ప్రజలూ జరుపుకోవడం వందలాది ఏళ్లుగా సాగుతోందని చంద్రబాబు గుర్తు చేశారు. మొహర్రం స్ఫూర్తితో మనమంతా మానవత్వం, లౌకికత్వంతో మెలుగుదామని స్పష్టం చేశారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ముస్లిం సోదరులంతా ఇళ్లలోనే మొహర్రం పండగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి. 'శిరోముండనం ఘటనలో నూతన్ నాయుడు భార్యపై కేసు నమోదు'