ETV Bharat / state

'వైకాపా నేతలు రాష్ట్రాన్ని ఆత్మహత్యల ప్రదేశ్​గా మార్చారు'

వైకాపా పాలనలో జరుగుతున్న ఆత్మహత్యలు తెదేపా అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన పూర్తిగా పడకేసిందని ట్విట్టర్​ వేదికగా విమర్శించారు.

'వైకాపా నేతలు రాష్ట్రాన్ని ఆత్మహత్యల ప్రదేశ్​గా మార్చారు'
author img

By

Published : Nov 10, 2019, 10:56 PM IST

Updated : Nov 13, 2019, 3:47 PM IST

'వైకాపా నేతలు రాష్ట్రాన్ని ఆత్మహత్యల ప్రదేశ్​గా మార్చారు'

వైకాపా నేతలు 5 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్​ను ఆత్మహత్యల ప్రదేశ్​గా మార్చారంటూ తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్ర చరిత్రలో ఇన్ని ఆత్మహత్యాయత్నాలు ఎప్పుడైనా చూశామా అంటూ ప్రశ్నించారు. తెనాలిలో వైకాపా నేతల వేధింపులతో యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడంటూ మండిపడ్డారు. ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. అంతే కాకుండా రాష్ట్రంలో పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన పడకేశాయన్నారు. పెట్టుబడులు పెట్టేవాళ్లను బెదిరించి తరిమేశారని ఆరోపించారు. కొత్తగా ఉద్యోగాలు సృష్టించలేని వైకాపాకు తొలగించే హక్కు ఎక్కడిదంటూ చంద్రబాబు ట్విట్టర్​లో పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

'త్వరలో ప్రభుత్వ కార్యాలయాల అమ్మకం అనే ప్రకటన చూస్తాం'

Intro:Body:

ap taaza

Conclusion:
Last Updated : Nov 13, 2019, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.