ETV Bharat / state

గ్యాస్ లీకేజీ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి: చంద్రబాబు - chandrababu tweet

విశాఖ జిల్లాలో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనలో బాధితులను... ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. వెంకటాపురం గ్రామంలో మరింత ఎక్కువగా ప్రాణనష్టం జరిగిందన్నారు. గ్రామంలో మల్టీ స్పెషాలిటి ఆసుపత్రిని నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు.

chandrababu tweets on lg polymers victims problems
గ్యాస్ లీకేజీ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలన్న చంద్రబాబు
author img

By

Published : May 19, 2020, 8:55 PM IST

chandrababu tweets on lg polymers victims problems
గ్యాస్ లీకేజీ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు ట్వీట్

దుర్ఘటన జరిగాక బాధితులకు భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ట్విట్టర్‌లో తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. లాలూచీ రాజకీయాలు చేసుకుంటూ పోతే ప్రజలు ఇలాగే రోడ్లెక్కుతారని ఆయన మండిపడ్డారు. వెంకటాపురం గ్రామస్థులు ప్రత్యేక ప్యాకేజీ కావాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో 5 కి.మీ. పరిధిలోని ప్రజలంతా నరకం చూశారని అన్నారు. వెంకటాపురం గ్రామంలో మరింత ఎక్కువగా ప్రాణనష్టం జరిగిందన్నారు. గ్రామస్థులకు సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో ఎందుకు అవకాశం కల్పించలేదని ప్రశ్నించారు. వెంకటాపురం గ్రామస్థులు కోరినట్లుగా ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని... గ్రామంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరకులు సంస్థతో ఇప్పించాలన్నారు.

ఇదీ చదవండి:

పోరాడుతున్నా... వెంటాడుతూనే ఉంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.