ప్రజల ఆస్తులకు ప్రభుత్వాలు ట్రస్టీలుగా ఉండాలని తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజల ఆస్తులను ప్రభుత్వం అమ్మడం ధర్మం కాదని మండిపడ్డారు. పార్టీ సీనియర్ నేతలతో ఆన్లైన్లో సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. వైకాపా మాఫియాకు భూములను కట్టబెట్టేందుకే 'బిల్డ్ ఏపీ పేరుతో సోల్డ్ ఏపీ' చేస్తున్నారని ఆరోపించారు.
భూముల ధరలు పడిపోయాయని ఆస్తులు అమ్మడం అవివేకమని... విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత సర్కార్‌పై ఉంటుందన్నారు. గుంటూరులో మార్కెట్ స్థలాలు, విశాఖలో విలువైన పోలీస్ క్వార్టర్స్ అమ్మేయడం దారుణమన్నారు.
ఫిబ్రవరిలో వచ్చిన కరెంటు బిల్లులే ప్రతి నెలా వసూలు చేసి... పెంచిన బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ కారణంగా ప్రజల వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. తిరిగి వారి వాహనాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: