సినీ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే దొరస్వామి రాజు మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విచారం వ్యక్తం చేశారు. సినిమా నిర్మాతగా, పంపిణీదారుడిగా, ఫిలిం ఛాంబర్ అధ్యక్షునిగా, తితిదే బోర్డు మెంబరుగా, ఎమ్మెల్యేగా దొరస్వామి రాజు అందించిన సేవలు ప్రశంసనీయమని చంద్రబాబు కొనియాడారు. ఎమ్మెల్యేగా నగరి నియోజకవర్గ అభివృద్దికి పాటుబడ్డారని గుర్తు చేసుకున్నారు.
విభిన్నమైన చిత్రాలు నిర్మించి సినీ రంగంలో తనకంటూ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్నారని లోకేశ్ గుర్తుచేసుకున్నారు. దొరస్వామి రాజు కుటుంబ సభ్యులకు చంద్రబాబు, లోకేష్‌లు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఇవీ చూడండి...