ETV Bharat / state

ప్రాథమిక హక్కులు హరిస్తున్నారు: గవర్నర్​కు చంద్రబాబు లేఖ - గవర్నర్​కు చంద్రబాబు లేఖ

రాష్ట్రంలో చట్ట విరుద్ధమైన అరెస్టులు, వేధింపులు జరుగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ మేరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​కు లేఖ రాశారు.

chandrababu letter to governor
chandrababu letter to governor
author img

By

Published : Jul 18, 2020, 3:09 PM IST

వేధింపులు , చట్టవిరుద్ధమైన అరెస్టులు జరుగుతున్నాయంటూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పోలీసు విభాగంలో కొందరితో అధికార పార్టీ నాయకుల కుమ్మక్కయ్యారని లేఖలో పేర్కొన్నారు. ప్రాథమిక హక్కుల పునరుద్దరణ పరిరక్షణ కోసం విజ్ఞప్తి చేశారు.

"రాష్ట్రంలో చట్టవిరుద్ధమైన అరెస్టులు, ప్రజల అక్రమ నిర్బంధాలు పెరిగిపోయాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. మాట్లాడే హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛను అధికార పార్టీ హరించి వేస్తోంది. సోషల్ మీడియా వేదికగా పోలీసులు అత్యంత అమానవీయ, అనాగరిక ధోరణితో వ్యవహరిస్తున్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం, నాయుడుపాలెం గ్రామంలోని వడ్డెల సందీప్ కుమార్ మరియు తొట్టెంపూడి చంద్రశేఖర్ లను 2020 జూలై 16 న అరెస్టు చేశారు. బాలినేనిపై ఇదే వార్తలు, తమిళనాడు అంతటా తమిళ మీడియాలో ప్రసారం అయ్యాయి, ప్రచురించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ నుండి భారీ మొత్తంలో నగదును అక్రమంగా రవాణా చేస్తున్న నిందితులపై సమగ్ర విచారణ చేయడం, వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి బదులుగా సందీప్, చంద్రశేఖర్​లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఇద్దరిని అరెస్ట్ చేసిన ఒంగోలు గ్రామీణ పోలీసులు, ఆ తర్వాత వారిని ఒక పోలీస్ స్టేషన్ నుండి మరొక పోలీస్ స్టేషన్ కు, 3 స్టేషన్లు తిప్పుతూ దారుణంగా కొట్టడమే కాకుండా భౌతికంగా హింసించారు" - తెదేపా అధినేత చంద్రబాబు

రాజ్యాంగం కేవలం న్యాయవాదుల పత్రం కాదని చంద్రబాబు అన్నారు. "అదొక జీవన నౌక, దాని ఆత్మ ప్రతినిత్యం సజీవం’’ అని అంబేడ్కర్ చెప్పిన సూక్తిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రం‌లో, బాబా సాహెబ్ అంబేడ్కర్ పేర్కొన్నరాజ్యాంగ 'ఆత్మ' ప్రత్యక్ష, పరోక్ష దాడికి గురైందని అన్నారు.

cbn letter to governor
గవర్నర్​కు చంద్రబాబు లేఖ

ఇదీ చదవండి: రెండు రోజుల్లో వస్తానని చెప్పి.. ఆరు నెలలైనా రాలేదు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.