ETV Bharat / state

తస్మాత్ జాగ్రత్త: బైక్​పై వస్తారు.. మెడలో గొలుసులు తెంపుకెళ్తారు

ద్విచక్ర వాహనాలపై వచ్చి మహిళల మెడలో బంగారు గొలుసులు తెంపుకుపోవటం రోజురోజుకూ పెరిగిపోతోంది. గతంలో పట్టణాల్లో జరిగే ఈ తరహా చోరీలు ప్రస్తుతం పల్లెలకు పాకాయి. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతున్నాయి. కృష్ణా జిల్లా పామర్రులో నేడు అలాంటివి 2 సంఘటనలు చోటు చేసుకున్నాయి.

chain snachers
గొలుసు దొంగలు
author img

By

Published : Oct 24, 2020, 8:44 PM IST

కృష్ణా జిల్లా పామర్రులో ఉదయం 7 గంటల సమయంలో సుబ్బరత్తమ్మ అనే మహిళ కిరాణా షాపునకు వెళ్తోంది. ఆమె వెనుకగా బైక్​పై వచ్చిన దుండగులు.. అకస్మాత్తుగా ఆమె ముందు బండి ఆపారు. మహిళ మెడలోని నానుతాడు లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆమె ప్రతిఘటించింది. ఇది గమనించిన మరో మహిళ గట్టిగా అరవటంతో దుండగులు పారిపోయారు.

ఇలాంటి ఘటనే మండల పరిధిలోని జమీగొల్వేపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన నాగమణి ఉదయం 8 గంటల ప్రాంతంలో చెత్త పారబోసేందుకు బయటకు వచ్చింది. ఇది గమనించిన ఇద్దరు వ్యక్తులు బైక్​పై ఆమెకు సమీపంగా వచ్చారు. అందులో ఒకరు బండి దిగి మహిళ మెడలోని రెండున్నర కాసులు బంగారు గొలుసు తెంపుకుపోయారు.

పామర్లు, జమీగొల్వేపల్లిలో జరిగిన ఘటనలు ఒకే తరహాలో ఉండటంతో.. ఇవి రెండూ ఒకరే చేశారేమోనని బాధితులు అనుమానిస్తున్నారు. ప్రశాంతంగా ఉండే పల్లెల్లో ఈ తరహా దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

ఇవీ చదవండి..

క్రికెట్ బెట్టింగ్​ ముఠా అరెస్ట్... ఏడున్నర లక్షలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.