రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మైలవరంలోని స్థానిక ఎండీవో కార్యాలయ వద్ద సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. అధికారులందరూ సాంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కుటుంబసమేతంగా పాల్గొన్నారు. భోగిమంటలు రాజేసి ఎమ్మెల్యే సంబరాలు ప్రారంభించారు. ఐసీడీఎస్ , ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో బొమ్మల కొలువులు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కోలాహలంతో సంక్రాంతి వేడుకలు అందరినీ అలరించాయి. సరైన సమయంలో వర్షాలు కురిసి, రైతులంతా ఆనందంగా ఉన్నారని.. కలకాలం ఇలాగే విలసిల్లాలని కోరుకుంటూ.. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇవీ చూడండి: