ETV Bharat / state

టోల్​గేట్ బూత్​పైకి దూసుకొచ్చిన లారీ

author img

By

Published : Jul 24, 2019, 1:25 PM IST

టోల్‌గేట్‌ బూత్​పైకి లారీ దూసుకొచ్చిన ఘటన తెలంగాణలోని మెదక్​ జిల్లా తూప్రాన్‌ పరిధిలోని అల్లాపూర్‌ టోల్‌గేట్‌ వద్ద చోటు చేసుకుంది. లోపల విధుల నిర్వహిస్తున్న వ్యక్తి త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

అల్లాపూర్‌ టోల్‌గేట్‌ వద్ద ప్రమాదం
అల్లాపూర్‌ టోల్‌గేట్‌ వద్ద ప్రమాదం

తెలంగాణలో నిజామాబాద్​ నుంచి హైదరాబాద్​ వైపుగా ఓ లారీ వస్తోంది. మెదక్​ జిల్లా తూప్రాన్​ పరిధిలోని అల్లాపూర్​ వద్ద టోల్​గేట్​ను గమనించని లారీ డ్రైవర్​ వాహనాన్ని విభాగిని పైకి ఎక్కించాడు. వెంటనే అప్రమత్తమై వేగం తగ్గించడం వల్ల టోల్​బూత్​ను ఢీకొట్టి పక్కకు ఒరిగింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్​ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు టోల్​ సిబ్బంది. ప్రమాద సమయంలో టోల్​బూత్​ను లారీ ఢీకొట్టిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. ఇవి చూస్తే అక్కడ విధులు నిర్వహిస్తున్న వ్యక్తి త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారని అనక మానరు.

Intro:Body:

cctv visuals

Conclusion:

For All Latest Updates

TAGGED:

cctv visuals
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.