దేశం గొప్ప న్యాయ కోవిదుని కోల్పోయిందని చంద్రబాబు సంతాపం తెలిపారు. రామ్ జెఠ్మలానీ న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేసిన గొప్ప రాజనీతిజ్ఞుడని కొనియాడారు. న్యాయవాదిగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. ఎన్నో చరిత్రాత్మక కేసులను వాదించి గెలుపొందారని గుర్తుచేశారు. వారి కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఇది కూడా చదవండి.
బాబాయిని చంపిందెవరో చెప్పలేని వ్యక్తి.. మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు