రాజధాని తరలించడంపై తెదేపా ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ - రాజధాని విభజన పై తెదేపా ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన
రాజధాని అమరావతిని తరలించడాన్ని నిరసిస్తూ.. కృష్ణా జిల్లా నందిగామ మండలంలోని గుడిమెట్లలో తెదేపా ఆధ్వర్యంలో గురువారం కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి కోట వీరబాబు హాజరయ్యారు. రాష్ట్ర అర్ధిక వ్యవస్థపై పెనుభారం పడేలా మూడు రాజధానులు ఏర్పాటు చేయడం సరికాదని ఆయన అన్నారు. రాజధాని విషయంలో జగన్ తీరుపై అన్ని ప్రాంతాల నుంచి విమర్శలు వస్తున్నాయన్నారు. రాజకీయ, అర్ధిక విశ్లేషకుల సూచనలు కూడా ప్రభుత్వ పెద్దలు పెడచెవిన పెడుతున్నారని ధ్వజమెత్తారు.
రాజధాని విభజన పై తెదేపా ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన