కరోనా వైరస్ ప్రభావం రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలపైనా పడింది. ఇప్పటికే తిరుమల శ్రీవారి దర్శనాలు నిలిచిపోగా.. విజయవాడ కనకదుర్గమ్మ ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు దేవస్థాన కార్యనిర్వాహణాధికారి తెలిపారు. ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4వతేదీ వరకు అంతరాలయ దర్శనం రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే అమ్మవారికి జరిగే పూజలు యాథతథంగా జరుగుతాయని స్పష్టం చేశారు. ఉగాది రోజున ఉత్సవంలో మార్పులు చేశామన్నారు. కరోనా వ్యాప్తి కాకుండా తీసుకుంటున్న చర్యలపై ఆలయ అధికారులతో ఈటీవీ భారత్ ముఖాముఖి..!
ఇదీ చదవండి: