కృష్ణా, గోదావరి నదుల్లో నిత్య హారతి ఎందుకు నిలిపివేశారో ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు నిలదీశారు. ఆంధ్రప్రదేశ్లో హిందుత్వాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు సింహాచలం భూముల్లో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆయన ఆరోపించారు. అలాగే దేవస్థాన భూముల్లో చర్చిలు కట్టారని ధ్వజమెత్తారు. అర్ధరాత్రి 5 జీవోలు ఇచ్చి మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్గా తమకు అనుకూలమైన వారిని సీఎం జగన్ నియమించుకున్నారని మంతెన ట్వీట్ చేశారు.
అటు ఇచ్చారు... ఇటు పెంచారు
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సహజవాయువుపై వ్యాట్ పెంచడంపై తెలుగు రైతు అధ్యక్షులు మారెడ్డి శ్రీనివాస రెడ్డి మండిపడ్డారు. సూట్ కేసు కంపెనీల ద్వారా క్విడ్ ప్రోకో చేసిన అనుభవంతోనే జగన్ పన్నుల రూపంలో ప్రజలపై పెనుభారం మోపుతున్నారని విమర్శించారు. ఒక చేత్తో ఇచ్చి... మరో చేత్తో లాగేసుకోవడం జగన్కు అలవాటేని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఆసరా డబ్బులు అందకముందే సహజవాయువుపై వ్యాట్ బాదేశారని మండిపడ్డారు. ఉచిత విద్యుత్తుకు మీటరు బిగించే ఆలోచనతో వ్యవసాయరంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నారని... వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామని మారెడ్డి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి