కృష్ణా జిల్లా గన్నవరం మీదుగా వెళ్లే జాతీయ రహదారిపై.. రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు శాంతి థియేటర్ ఎదుట టైర్ పంచర్ అయింది. ఈ క్రమంలో డ్రైవర్ టైర్ మారుస్తున్నాడు. వెనక నుంచి వచ్చిన లారీ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కాకినాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్ డ్రైవర్ ఘటన స్థలంలోనే చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.
ఆగి ఉన్న బస్సుకు లారీ ఢీ.. డ్రైవర్ మృతి
కృష్ణా జిల్లా గన్నవరం జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
కృష్ణా జిల్లా గన్నవరం మీదుగా వెళ్లే జాతీయ రహదారిపై.. రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు శాంతి థియేటర్ ఎదుట టైర్ పంచర్ అయింది. ఈ క్రమంలో డ్రైవర్ టైర్ మారుస్తున్నాడు. వెనక నుంచి వచ్చిన లారీ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కాకినాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్ డ్రైవర్ ఘటన స్థలంలోనే చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.
కంట్రీబ్యూటర్:- కొండలరావు దర్శి 9848450509
నూట నలబై ముగ్గురకు(143మందికి) ఒకే ఒక్క మరుగుదొడ్డా అది ఎలా సాద్యమనుకుంటున్నారా?ఇది నిజమే మరి.
ప్రకాశంజిల్లా కురుచేడు మండలం కురుచేడు గ్రామంలోని ఎస్సీసాంఘీక సంక్షేమ బాలురవసతి గృహం అద్దె భవనంలో నడుస్తుంది. ఆ వసతి గృహంలో మొత్తం మూడు మరుగు దొడ్లుకలవు కానీ వాటిలో రెండు పాడైపోయాయి ఉపయోగ పడేది ఒక్కటే. వసతి గృహంలోని 143మంది విద్యార్ధులకు ఒకే ఒక్క మరుగుదొడ్డి కలదు.వసతి గృహంలోని విద్యార్ధులు కాలకృత్యాలుతీర్చుకోవాలంటే వరుసలో నిలబడాల్సిందే.నావంతుఎప్పుడువస్తుందా అని ఎదురుచూపులుచూడాల్సిందే. అలాకాకపోతే చెంబుచేత పట్టుకొని బహిర్భూమి వైపు నడక సాగించాల్సిందే.మనదేశ ప్రభుత్వాలు స్వచ్చభారత్ ని స్థాపించాలంటే విద్యార్ధులు ప్రజల్లో చైతన్యం కలిగించాలి అని చెపుతున్నసంగతి మనకు తెలిసిందే ఆ విద్యార్ధులకే అలాంటి సమస్య వస్తే విద్యార్ధులు ఎవరిని చైతన్య పరచాలో!వసతిగృహనిర్వాహునికి(వార్డెన్)కి ఎన్నిసార్లు తెలి యజేసినా పట్టిం చుకున్నధాఖలాలులేవు.దీనికారణంగా పాఠశాలకు ఆలస్యంగా వెళ్లవలసివస్తుంది.అంతేకాదు మేము వుండే గదులు కూడా చిన్నవి అవడంవలన ఒకరిమీదఒకరు పడుకోవాల్సివస్తుంది అంటున్నారు వసతిగృహ విద్యార్ధులు.మూత్ర విసర్జనకు సైతం రహదారిపైకి వెళ్ళవలసివస్తుంది. వసతిగృహం కురుచేడు నుండి వినుకొండ కు వెళ్ళే రహదారి పక్కనే వుండటంవలన వాహన రాకపోకల రద్దీ ఎక్కువగా వుంటుంది.దీనివలన మూత్రవిసర్జనకు రహదారి దాటేటప్పుడు బస్సో,లారీనో ఢీ కొడుతుందేమోయని భయంతో రోజూ అల్లాడిపోతున్నాము.ఒక్కసారి వసతిగృహ పరిసరాలను మనం చూస్తే తెలుస్తుంది విద్యార్ధులు పడే వెతలు.వంటసాల పరిస్థితి కూడా అంతే. విద్యార్ధులకు తయారుచేసే వంట పదార్ధాలపై ఈగలు ముసురుకొని నానా భీభత్సము చేస్తున్నాకనీసం మూతలు కూడా వేసే వారులేరు.అలాంటి పదార్దాలు ఆరగించినచో రోగాల బారిన పడక తప్పదు అంటున్నారు విద్యార్ధులు. ఈసమస్యేలే కాదు వసతి గృహం ముందుబాగంలో విద్యుత్ స్తంభం తీగలు చేతికాందే ఎత్తులో వుండి విద్యార్ధులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.ఇన్ని కఠినమైన సమస్యలతో విద్యార్ధులు కాలం వెళ్లదీస్తున్నారు.
ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే విద్యార్ధులకు అత్యవసర సమయంలో ఇచ్చే మాత్రలు కాలం చెల్లినవిగా తెలు స్తుంది.వసతి గృహ నిర్వాహకుడిని వివరణ అడిగితే సమాదానం దాటవేశాడు.విద్యార్ధుల ఆరోగ్యంతో చెలగాట మాడుతున్న వార్డెన్ ను పై అధికారులు ఇప్పటికైనా పరిశీలించి అతనిపై చర్యలు చేపట్టాలని విద్యార్ధులు కోరుకుంటున్నారు.
బైట్స్ : 1.కాలేబు 9 వ తరగతి విద్యార్ధి
2.పండు 6 వ తరగతి విద్యార్ధి
3.శివశంకర్ హోస్టల్ వార్డన్
Body:ప్రకాశంజిల్లా దర్శి. Conclusion:కొండలరావు దర్శి 9848450509