తమ డిమాండ్లు పరిష్కరించాలని 29న ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి భవన నిర్మాణ కార్మికుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నరసింహారావు పిలుపునిచ్చారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ నిర్ణయాన్ని కార్మిక సంఘాల ఐకాస తీవ్రంగా వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు.
కార్మికుల సంక్షేమ నిధి నుంచి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నిలుపుదల చేస్తూ జారీ చేసిన జీవో 17ను వెంటనే రద్దు చేయాలని విజయవాడలో డిమాండ్ చేశారు. ఇప్పటికే నిధుల మళ్లింపు, పథకాల అమలుపై 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేశామన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని చెప్పారు.
ఇదీచూడండి:
రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమే!