రాష్ట్రంలో లేఅవుట్ ప్లాన్, బిల్డింగ్ ప్లాన్ అనుమతులు, కమెన్స్మెంట్ సర్టిఫికెట్ల కాల వ్యవధిని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు ఆదేశాలు ఇచ్చారు.
కరోనా నేపథ్యంలో 2021 మార్చి 31 వరకు వ్యాలిడిటీని పొడిగించిది. ఈ ఏడాది మార్చి 25వ తేదీ తర్వాత గడువు ముగిసిన వాటికి మాత్రమే ఈ పొడిగింపు ఉత్తర్వులు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీని కోసం ఎలాంటి రుసుం, దరఖాస్తు అక్కర్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదీ చదవండి