కృష్ణా జిల్లా నందిగామ సీఐటీయు కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులు దీక్ష చేపట్టారు. లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన కార్మికులకు ప్రభుత్వం తక్షణమే రూ.10,000 ఆర్థిక సాయం అందించాలని సీఐటీయు నేత కటారపు గోపాల్ డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి 35 కేజీల బియ్యం, 16 రకాల నిత్యావసర వస్తువులు అందించాలన్నారు. అప్పుడు ఇసుక కొరతతో ఉపాధి కోల్పోతే.. ఇప్పుడు కరోనాతో పూట గడవని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ గోడును పట్టించుకోవడంలేదని ఆయన విమర్శించారు. లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న వలస కార్మికులను వారి స్వగ్రామాలకు చేర్చాలని కోరారు.
ఇదీ చూడండి: