విజయవాడలో ప్రెస్ క్లబ్ సమీపంలోని సాంబమూర్తి రోడ్డులో ఎస్కేసీవి చిల్డ్రన్స్ హోమ్ పక్కన పోలీస్ క్వార్టర్స్కు ఆనుకుని ఉన్న గోడలోపెద్ద మర్రి చెట్టు విరిగి రోడ్డుపై పడింది. ఈ ఘటనలో ఒక కారు, బస్సు ధ్వంసమయ్యాయి. కారులో నిద్రిస్తున్న వ్యక్తి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. డ్రైవింగ్ సీట్‌ను వాల్చి పడుకుని నిద్రిస్తుండటంతో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. అనుకోని ఈ సంఘటనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: ఎస్పీ