ETV Bharat / state

నువ్వే లేని లోకానా... నేనుండలేను - kudurupalli crime news

అమ్మాయిని గాఢంగా ప్రేమించాడో యువకుడు. ఆమె సర్వస్వం అనుకున్నాడు. తనతో జీవితాన్ని ఊహించుకున్నాడు. చావైనా బతుకైనా తనతోనే అనుకున్నాడు. ఇంతలో విధి కాటేసింది. అనారోగ్యం రూపంలో మృత్యువు యువతిని బలిదీసుకుంది. ప్రేయసి మరణాన్ని తట్టుకోలేకపోయిన ఆ యువకుడి హృదయం ముక్కలైంది.. ఆమె చావుని జీర్ణించుకోలేని ఆ ప్రేమికుడు అర్ధాంతరంగా తనవు చాలించి ప్రియురాలి చెంతకు చేరిన ఘటన తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది.

Young man committed sucide in kudurupalli
తెలంగాణ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో యువకుడి ఆత్మహత్య
author img

By

Published : Oct 25, 2020, 8:42 PM IST

నువ్వు లేని లోకంలో నేను ఉండలేను అంటూ ప్రియురాలి మృతి తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కుదురుపల్లిలో చోటుచేసుకుంది. దసరా పండుగ రోజున గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన సల్ల మహేశ్​ ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. ఇటీవల అమ్మాయి అనారోగ్యంతో మృతి చెందింది. ఈ నేపథ్యంలో మహేశ్​ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

రోజువారీ విధుల్లో భాగంగా ఇంటి నుంచి వచ్చి అమ్మాయి సమాధి వద్ద చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పపడ్డాడు. బాధితుడి సెల్​ఫోన్ స్టేటస్ చూసి స్నేహితులు సమాచారాన్ని కుటుంబసభ్యులకు అందించగా అప్పటికి మృతి చెందాడు. మహేశ్​ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలించారు. శవ పరీక్ష నిమిత్తం మహాదేవపూర్ సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు.

ఇదీ చదవండి- దసరా హోరు.. వాహన విక్రయాల జోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.