ETV Bharat / state

పాల ప్యాకెట్​ కోసం వెళ్లి అదృశ్యమైన బాలుడు ఆచూకీ లభ్యం

పాల ప్యాకెట్​ తెస్తానని బయటకు వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి రాకపోవడం విజయవాడలో కలకలం రేపింది. అయితే బాలుడు హైదరాబాద్​లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాలుడిని నగరానికి తీసుకొచ్చిన అనంతరం మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది.

boy missing at satyanarayanapuram
అదృశ్యమైన బాలుడు
author img

By

Published : Nov 18, 2020, 3:58 PM IST

Updated : Nov 18, 2020, 5:17 PM IST

విజయవాడలో కలకలం రేపిన బాలుడు మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. బాలుడు హైదరాబాద్​లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. బాలుడిని నగరానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. సత్యనారాయణపురం పోలిస్టేషన్ పరిధిలోని మధురానగర్​కు చెందిన బాలుడు ఉదయం పాల ప్యాకెట్​ తెస్తానంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఎంత సమయమైనా తిరిగి ఇంటికి రాకపోవటం వల్ల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ మేరకు బాలుడు తండ్రి కులశేఖర్ పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. బాలుడు హైదరాబాద్​లోని ఓ క్రికెట్ అకాడమీలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో బాలుడిని విజయవాడకు తీసుకొచ్చేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.

అయితే బాలుడు హైదరాబాద్​కు ఎందుకు వెళ్లాడు.. ఎలా వెళ్లాడు. ఎవరైనా కిడ్నాప్​ చేసి తీసుకెళ్లారా..? లేక బాలుడే వెళ్లాడా అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉండగా.. బాలుడు నగరానికి వచ్చిన అనంతరం మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి"
'ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు'

Last Updated : Nov 18, 2020, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.