హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా తెలంగాణ తెలుగు యువత ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. తెలంగాణ తెలుగు యువత అధ్యక్షుడు పొగాకు జయరాం చందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ హాజరయ్యారు.
ఎన్టీఆర్ స్ఫూర్తితో సేవ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. తలసేమియాతో బాధపడుతున్న వారికి రక్తం ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు రక్తదానం చేశారు.
ఇదీ చూడండి. దీటుగా స్పందిద్దాం...అపెక్స్ కౌన్సిల్ భేటీపై సీఎం నిర్దేశం