కాంగ్రెస్ పార్టీని రైతులే దేశం నుంచి తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. రైతుల ముసుగులో విపక్షాలు ఆందోళన చేయడాన్ని ఆయన ఆక్షేపించారు. భారతీయ జనతాపార్టీ ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుందన్నారు. వ్యవసాయ చట్టాలపై రైతులను తప్పదోవ పట్టించి ఇష్టం వచ్చినట్లు నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. మరో పరాభావం ఎదురుకాక ముందే విపక్షాలు బంద్‌ను విరమించాలని కోరారు.
ఇవీ చూడండి...