ETV Bharat / state

'ఏపీలో ఆలయాలపై దాడులు.. జోక్యం చేసుకోండి' - News of demolition of idols in temples in AP

ఏపీలో దేవాలయాలపై జరిగిన దాడులకు సంబంధించి రాష్ట్ర‌ ప్రభుత్వం దర్యాప్తు జరిపించేలా చూడాలని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు రాజ్యసభలో కోరారు.

భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు
భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు
author img

By

Published : Feb 3, 2021, 9:09 PM IST

ఏపీలో దేవాలయాలపై జరిగిన దాడులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దర్యాప్తు జరిపించేలా చూడాలని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు రాజ్యసభలో కోరారు. ఏపీలో జరిగిన పలు ఘటనలను ప్రస్తావించిన ఆయన వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యమే వీటికి కారణమన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాల్లో జరుగుతున్న దాడులను సభతో పాటు దేశం దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఉత్తరాంధ్ర అయోధ్యగా పిలిచే విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో ఇటీవల జరిగిన ఘటన దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. గత ఏడాదిన్నరగా ఏపీలో ఈ తరహా దాడులపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోవటమే దీనికి కారణం. ఈ ఘటనలు రాష్ట్రంలోనేగాక దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు, ధర్మాచార్యులను బాధిస్తాయి’ అని జీవీఎల్‌ అన్నారు.

ఇవీ చదవండి: పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్​లో మార్పులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.