ETV Bharat / state

'బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్​గా ఆయన ఉండటం మా దౌర్భాగ్యం' - ఏపీ బడ్జెట్ వార్తలు

బడ్జెట్​లో ఒక్క రూపాయి కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి ప్రతిపాదించకపోవటం బాధకరమని భాజాపా థార్మిక సెల్ కన్వీనర్ చైతన్య శర్మ తెలిపారు. ప్రభుత్వం బ్రాహ్మణ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తోందని విజయవాడలో ఆయన అన్నారు.

bjp dharmika cell  convener conference on budget
భాజాపా ధార్మిక సెల్ నాయకుల సమావేశం
author img

By

Published : Jun 17, 2020, 1:50 PM IST

బడ్జెట్​లో ఒక్క రూపాయి కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి ప్రతిపాదించకపోవటం బాధకరమని భాజాపా థార్మిక సెల్ కన్వీనర్ చైతన్య శర్మ తెలిపారు. ప్రభుత్వం బ్రాహ్మణ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తోందని ఆయన అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడారు. బ్రాహ్మణ కార్పొరేషన్​కు వెయ్యి కోట్లు ఇస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీని విస్మరించి, మాట తప్పి మడమ తిప్పి బ్రాహ్మణ సామాజిక వర్గం గొంతు కోశారన్నారు. బడ్జెట్​లో కనీసం బ్రాహ్మణ సామాజిక వర్గ ప్రస్తావన లేకపోవడం దారుణమన్నారు. కార్పొరేషన్ ఛైర్మన్​గా ఉన్న మల్లాది విష్ణు కనీసం కార్పొరేషన్​కు నిధులు మంజూరు చేయించుకోలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్చకులకు రూ. 5 వేల ఆర్థిక సాయం అన్నారని... కనీసం 10వేల మందికి కూడా కూడా ఇవ్వలేదనన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్​గా విష్ణు లాంటి అసమర్థులు ఉండడం బ్రాహ్మణుల దౌర్భాగ్యమని మండిపడ్డారు. వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి. పదో తరగతి పరీక్షలు రద్దు చేయండి : కన్నా లక్ష్మీనారాయణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.