ETV Bharat / state

కొల్లేరులో పక్షుల లెక్కింపు మొదలైంది! - kolleru lake news

కొల్లేరు సరస్సులో పక్షుల సందడి చేస్తున్న విహంగాల లెక్కింపు ప్రారంభమైంది. బుధవారం ప్రారంభమైన లెక్కింపునకు 30 మంది సిబ్బంది ఉదయం నుంచి సాయంత్రం వరకు వారం రోజులపాటు పలు ప్రాంతాల్లో పక్షులను చిత్రీకరించి లెక్కింపు చేపడుతున్నారు. అనుకూల వాతావరణం కావడంతో 10 శాతం పక్షుల సంఖ్య పెరిగి ఉండవచ్చని పర్యావరణ ప్రేమికులు, సిబ్బంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

birds count start at  kolleru lake
కొల్లేరులో పక్షుల లెక్కింపు మొదలైంది
author img

By

Published : Jan 10, 2021, 2:22 PM IST

వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి కొల్లేరులో సందడి చేస్తున్న విహంగాల లెక్కింపు ప్రారంభమైంది. ఏటా నవంబరులో విడిదిగా వచ్చి సంతానోత్పత్తి చేసుకొని మార్చిలో ఈ ప్రాంతం నుంచి పిల్లలతో తరలుతాయి. అనుకూల వాతావరణం కావడంతో 10 శాతం పక్షుల సంఖ్య పెరిగి ఉండవచ్చని పర్యావరణ ప్రేమికులు, సిబ్బంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కృష్ణా జిల్లాలో రెండు, పశ్చిమగోదావరి జిల్లాలో 7 మండలాల్లో విస్తరించి ఉన్న కొల్లేరులో 72 రకాల మత్స్యసంపద, 189 పక్షిజాతులు ఉన్నాయి. విదేశీ, స్వదేశీ పక్షులకు, వివిధ రకాల మత్స్యసంపదకు నిలయం ఈ కొల్లేరు ప్రాంతం. వన్యప్రాణి విభాగం సిబ్బంది లెక్కింపు నిర్వహించి వాటి వివరాలను నమోదు చేస్తారు. ఈ ఏడాది బుధవారం ప్రారంభమైన లెక్కింపునకు 30 మంది సిబ్బంది ఉదయం నుంచి సాయంత్రం వరకు వారం రోజులపాటు పలు ప్రాంతాల్లో పక్షులను చిత్రీకరించి లెక్కింపు చేపడుతున్నారు. స్థానిక పక్షిజాతులు, విదేశీ పక్షుల వివరాలను పరిశీలించి లెక్కింపు నిర్వహిస్తున్నారు. ఏటా వచ్చేవి, ఈ ఏడాది కొత్తగా వచ్చేవాటి వివరాలను సేకరించి పొందుపరుస్తున్నారు.

విదేశీ పక్షులు 8వేల కిలోమీటర్ల దూరం పయనించి వచ్చినట్లు తెలిపారు. వృద్ధాప్యం, అనారోగ్యంతో ఉన్నవి స్థానికంగానే ఉన్నవి, కొత్తగా వచ్చిన పక్షుల వివరాలు నమోదు చేస్తున్నారు. సైబీరియా, దక్షిణాఫ్రికా, కెనడా, అమెరికా, అస్ట్రేలియా తదితర దేశాల నుంచి గూడబాతు, ఎర్రకాళ్లకొంగ, పరదలు, పాము బాతులు, కంకణాలు, జుట్టు సిలువబాతులు, కొండింగాయిలు, నత్తగొట్టులు, గుడికొంగలు తదితరాలు ఏటా వస్తున్నాయి.

ఇదీ చదవండి:

'పర్యావరణానికి హానిచేస్తే కఠిన చర్యలు తప్పవు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.