ETV Bharat / state

కొత్త అందాలు సంతరించుకున్న సంగమ ప్రదేశం

దాదాపు దశాబ్దం తర్వాత కృష్ణానదికి వరదలు పోటెత్తాయి. తీరప్రాంతమంతా జలకళ సంతరించుకుంది. సుమారు 1400 కిలోమీట్రలు బిరబిరా పరుగులెత్తిన కృష్ణమ్మ... సముద్రుడి ఒడికి చేరుకుంటోంది. ఎంతో మందికి ఆనందాన్ని, కొందకిరి వేదనను పంచుతూ ఉరకలెత్తే కృష్ణమ్మ... సముద్రంంలో చేరే సమయంలో మాత్రం ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది. ఆ సుందర సంగమ ప్రదేశాన్ని కనులారా వీక్షించేందుకు పర్యాటకలు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు.

కొత్త అందాలు సంతరించుకున్న సంగమ ప్రదేశం
author img

By

Published : Aug 16, 2019, 6:56 AM IST

కొత్త అందాలు సంతరించుకున్న సంగమ ప్రదేశం

మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో జీవనదిగా పేరుగాంచిన కృష్ణానది... దాదాపు పదేళ్లుగా ఆశించిన స్థాయిలో నీటి లభ్యత లేదు. ఎగువ నుంచి నీరు రాక రాష్ట్రంలో జలాశయాలన్నీ వెలవెలబోయాయి. కానీ ఈ ఏడాది కృష్ణా పరివాకంలో కురిసిన భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తోంది. బిరబిరా పరుగులు తీస్తూ... జలాశయాలన్నీ నింపేసింది. ప్రకాశం బ్యారేజీ నుంచి విడుదలైన వరద నీరు లంకలు, లోతట్టు ప్రాంతాలను తాకుతూ... చివరగా హంసలదీవి వద్ద ప్రశాంతంగా కడలి ఒడికి చేరుతోంది. ఆ దృశ్యాలను చూసేందుకు సందర్శకులు పోటెత్తుతున్నారు.

ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువన పులిగడ్డ వద్ద కృష్ణానది రెండుపాయలుగా విడిపోయి... ఒక పాయ నాగాయలంక మండలం ఎదురుమొండి వద్ద బంగాళాఖాతంలో కలిస్తే...మరోపాయ కోడూరు మండలం హంసలదీవి వద్ద కడలిలో కలుస్తుంది. వందల కిలోమీటర్లు ఉద్ధృతంగా ప్రవహిస్తూ... ప్రజలను, అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించే కృష్ణమ్మ... సముద్రంలో కలసేచోట మాత్రం ప్రశాంతంగా ఒదిగిపోతుంది. కృష్ణా నది సముద్రంలోకి కలిసి ప్రాంతాన్ని చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. ఆ ప్రదేశంలో ఫొటోలు తీసుకుంటూ... మధురమై దృశ్యాలను తమ ఫొన్లలో బందిస్తున్నారు.

ఇదీ చదవండీ...

ప్రమాద ఘంటికలు... ఆవేదనలో అన్నదాతలు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.