ETV Bharat / state

బాపు మ్యూజియం... ఇకపై కమనీయం రమణీయం!

ఒకప్పుడు విక్టోరియా మ్యూజియంగా ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత బాపు మ్యూజియంగా పేరుమార్చుకుని అందని మన్ననలు పొందింది. ప్రస్తుంతం సరికొత్త హంగులతో ముస్తాబవుతోంది. అక్కడి దృష్యాలు కమనీయంగా... ఆ వాతావరణం రమణీయంగా ఉండేందుకు యంత్రాంగం శ్రమిస్తోంది.

author img

By

Published : Jul 26, 2019, 4:12 AM IST

'కొత్త హంగులతో బాపు మ్యూజియం'
'కొత్త హంగులతో బాపు మ్యూజియం'

శతాబ్దాల ఘన చరితకు సాక్ష్యాలుగా నిలిచే ఎన్నో శిలా రూపాలు... వందల ఏళ్ల నాటి జీవన విధానాన్ని కళ్ళకు కట్టే ఆనవాళ్లు... రాజుల కాలంనాటి వస్తువులు... ఇలా ఎన్నో విశేషాలతో విజ్ఞానం పంచేవి మ్యూజియాలు. వాటిలో బాపు ప్రదర్శనశాల ఒకటి. విజయవాడలోని ఈ మ్యూజియం.. ఒకప్పుడు విక్టోరియా మ్యూజియంగా ప్రసిద్ధి. తర్వాత బాపు మ్యూజియంగా పేరు మార్చారు. ప్రస్తుతం ఈ ప్రదర్శన శాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు... పురావస్తు శాఖ కృషి చేస్తోంది. కొత్తగా రెండతస్తుల భవన నిర్మాణంతోపాటు గ్యాలరీల ఏర్పాటు జరుగుతోంది.

కొండపల్లి కోటకు సాంకేతిక హంగులు అద్దినట్టే... బాపు మ్యూజియంలోనూ అధునాతన సాంకేతికత జోడిస్తోంది. వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి... ట్రాక్ వెంబడి పురాతన శిలలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఆగ్మెంట్ రియాలిటీ సాయంతో... ప్రతి శిల్పం మాట్లాడేలా తీర్చిదిద్దుతున్నారు. బౌద్ధ చరిత్ర సహా చారిత్రక విశేషాలు తెలిపేలా తెరలు సిద్ధం చేస్తున్నారు. సందర్శకులను కట్టిపడేసేలా 3డీ యానిమేషన్‌తో ఆడియో, వీడియో గదిని రూపొందిస్తున్నారు.

కొన్ని నెలల క్రితమే పనులు పూర్తికావాల్సి ఉన్నా... నిధుల మంజూరులో జాప్యం, ఎన్నికల నియమావళి కారణంగా పనులు మందగించాయి. గత నెల నుంచి ఊపందుకున్న పనులు దాదాపుగా పూర్తయ్యాయి. త్వరలో సందర్శకులకు అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా పనులు శరవేగంగా సాగుతున్నాయి.

Intro:పశ్చిమగోదావరి జిల్లాలో వ్యవసాయానిదే ప్రధమ స్థానం.. అన్నదాతలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మెట్ట ప్రాంతంలో పంటల సాగుకు ప్రధాన సాగునీటి వనరులు మాత్రం చెరువులే. వర్షాలు సమృద్ధిగా కురిసి నీరు చేరితే రైతుల ఆనందానికి అంతుండదు. అయితే ఇటీవల ఈ పరిస్థితి కనిపించడం లేదు . దీనికి కారణం చెరువుల ఆక్రమణలకు గురి కావడమే. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అవకాశం వస్తే ఆక్రమించుకుంటున్నారు .ఏళ్ల తరబడి అడ్డూఅదుపు లేకుండా ఆక్రమణల పర్వం కొనసాగుతుండడంతో కొన్ని చెరువులు కనుమరుగయ్యాయి. మరికొన్ని నామమాత్రంగా మిగిలాయి. ద్వారకాతిరుమల మండలం పి కన్నాపురం పంచాయతీ పరిధి సత్తాల పెద్ద చెరువు ఇదే కోవలోకి వస్తుంది. గతంలో 32.83 ఎకరాల్లో ఉండే ఈ చెరువు భూమి క్రమంగా ఆక్రమణదారుల పర్వం అయ్యింది. ప్రస్తుతం దాదాపు మూడు ఎకరాలు మాత్రమే ఈ చెరువు మిగిలింది.

Body:పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం పి కన్నపురం పంచాయతీ శివారు సత్తాల గ్రామంలో సర్వే నంబర్ 205 లో పెద్ద చెరువు ( ఆయకట్టు చెరువు) 32.83 మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. దీని కింద 150 ఎకరాల ఆయకట్టు ఉంది. శతాబ్దాల కాలంగా స్థానిక పొలాలకు ఇదే ప్రధాన నీటి వనరుగా ఉండేది .సాధారణ వర్షాలు కురిసినప్పుడు ఈ చెరువు నిండి ఆయకట్టు భూములకు పుష్కలంగా నీరు అందేది .మరోపక్క భూగర్భ జల మట్టం పెరగడంతో సమీప ప్రాంతాల్లో బోరుబావుల కింద పొలాల్లో సాగుకు దోహదపడేది .ఈ ప్రాంతానికి ప్రధాన నీటి వనరు అయిన ఈ చెరువు ఆక్రమణలతో కనుమరుగయ్యే స్థితికి చేరింది .ప్రస్తుతం దాదాపు 3 ఎకరాల్లో మాత్రమే ఈ చెరువు మిగిలింది .అక్రమార్కులు చెరువుగట్టు తొలగించి భూములను కబ్జా చేసి వ్యవసాయం చేస్తున్నారు. దీంతో ఆయకట్టు భూములకు నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించి అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.

Conclusion:అధికారులు స్పందించకపోవడంపై రైతులు పలు విమర్శలు చేస్తున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.