కృష్ణా జిల్లా నందిగామలో గోపు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి తన స్థలాలు, దుకాణాలపై ఎస్‌బీఐ బ్యాంకులో 42 కోట్ల రూపాయల రుణం తీసుకున్నాడు. ఈ అప్పు తీసుకుని 20సంవత్సరాలు అయినా యజమాని అప్పు చెల్లించని కారణంగా.. ఎస్‌బీఐ వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
వాదోపవాదనలు విన్న కోర్టు 10 దుకాణాలను వేలం పెట్టి వచ్చిన డబ్బు ద్వారా తమ రుణంలో చెల్లించుకోవాలని ఉత్తర్వులను జారీచేసింది. అయితే దుకాణాల్లో అద్దెకి ఉండేవారు తాము ఖాళీ చేయబోమని.. తమకు ముందుగా ఎవరు తెలియపరచలేదని పోలీసులతో, బ్యాంకు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఇదీ చదవండి: