ఈదురు గాలుల కారణంగా.. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం, కోసురువారిపాలెం, నాగాయతిప్ప, బొబ్బర్లంక, మోపిదేవి లంక, కొత్తపాలెం, ఉత్తర చిరువాలంక గ్రామాల్లో వందలాది ఎకరాల్లో అరటి చెట్లు నేలకూలాయి. ఒక్కో ఎకరంలో 25 శాతం వరకు అరటి చెట్లు నేలకొరిగాయి. ఏడాదంతా కష్టపడి పండించిన పంట ఇలా అయ్యిందని రైతులు భోరుమన్నారు.
ధర వస్తుంది అనుకుంటే..
మంచి ధర వస్తుంది అని ఆశిస్తే ఇంతలోనే తీవ్ర పంట నష్టం జరిగిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అరటి పంటకు ఎకరాకు రూ. 80 వేలు పెట్టుబడి అవుతుందని, ఒక్కో ఎకరాకు సుమారు రూ. 20 వేల వరకు నష్టపోయామని రైతులు తెలిపారు. మునగ పంట సైతం బలమైన గాలులకు నేలమట్టమైందని.. మరోవైపు మామిడి కాయలు సైతం 50 శాతం రాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమను ఆదుకుని ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: