తెలంగాణ సీఎం కేసీఆర్ కు నందమూరి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి జీవితాన్ని భవిష్యత్తు తరాలకు తెలిపేలా పాఠ్య పుస్తకాల్లో ప్రచురించడంపై హర్షం వ్యక్తం చేశారు. కళకు, కళాకారులకు విలువ పెంచిన కథానాయకుడు ఎన్టీఆర్ అని బాలకృష్ణ కొనియాడారు. తెలుగోడి ఆత్మగౌరవాన్ని దిల్లీ పీఠాన్ని కదిలించేలా వినిపించిన మహానాయకుడని కీర్తించారు. ఎన్నో సాహసోపేతమైన ప్రజారంజక నిర్ణయాలతో ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రజానాయకుడు అని గుర్తుచేశారు.
మదరాసీయులమనే పేరును చెరిపి భారతదేశపటంలో తెలుగువాడికి, తెలుగు వేడికి ఒక ప్రత్యేకతని తెచ్చిన తెలుగుజాతి ముద్దు బిడ్డ తన తండ్రి నందమూరి తారక రామారావు అని బాలకృష్ణ భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. భవిష్యత్తు తరాలకి స్ఫూర్తినిచ్చేలా ఆయన గురించి 10వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకంలో పాఠ్యాంశంగా చేర్చిన తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి హృదయ పూర్వక ధన్యవాదాలని ఫేస్ బుక్ లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: