ETV Bharat / state

'డాక్టర్ల నిర్లక్ష్యమే.. మా బిడ్డను చంపేసింది' - baby died

ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించేసిన కొన్ని గంటలకే నవజాత శిశువు మరణించిన ఘటన విజయవాడలో వివాదాస్పదమైంది. వైద్యుల నిర్లక్ష్యమే తమ బిడ్డ మరణానికి కారణమంటూ... శిశువు బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టారు.

'డిఛార్జ్​ చేసిన కొన్ని గంటలకే నవజాత శిశువు మరణం'
author img

By

Published : Sep 12, 2019, 7:38 PM IST

Updated : Sep 12, 2019, 10:38 PM IST

'డిస్​ఛార్జ్​ చేసిన కొన్ని గంటలకే నవజాత శిశువు మరణం'

విజయవాడ నోరి పిల్లల ఆసుపత్రి వివాదంలో చిక్కుకుంది. ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించిన కొన్ని గంటలకే నవజాత శిశువు మరణించాడు. వైద్యుల నిర్లక్ష్యమే తమ బిడ్డ మరణానికి కారణమంటూ.... శిశువు తల్లిదండ్రులు ఆరోపించారు. బాలుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆసుపత్రి వద్ద ధర్నా చేపట్టారు. కనీసం తమ బిడ్డను ముట్టుకోకుండా మందులు ఇచ్చారని.. టీటీ ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే పసుపు రంగులోకి బిడ్డ మారిపోయినా పట్టించుకోలేదని ఆరోపించారు. 9 నెలలు మోసిన తనకు.. మృత శిశువును చేతికి అందించారని తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న దశలో పోలీసులు జోక్యం చేసుకుని బాలుడి తల్లిదండ్రులను సముదాయించారు. తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ధర్నా విరమింపజేశారు.

ఇది చూడండి:

ఆసుపత్రి టాయిలెట్లలో శిశువు మృతదేహం

Intro:దాతల సాయం... విద్యార్థులకు అభయం..!

దాతల సాయంతో విద్యార్థులకు తాగునీరు, మరుగుదొడ్ల సమస్య తొలగిపోయింది. నూతనంగా ఏర్పాటు చేసిన బోరుబావిని, మరుగుదొడ్లను ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రారంభించారు.

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తెరన్నపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్ల వసతి లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు.. ఈ విషయాన్ని కాకర్ల రంగనాథ్ సేవా సమితి అధ్యక్షుడు కాకర్ల రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి రూ.7 లక్షలు వెచ్చించి పాఠశాలల్లో 8 మరుగుదొడ్లు, ఒక బోరు బావిని తవ్వించి నీటి ట్యాంకును కూడా ఏర్పాటు చేశారు. వీటి ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బోరుబావిని, నీటి ట్యాంకును ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు కొందరు మాత్రమే నిస్వార్థంగా చేస్తారని వారిలో కాకర్ల రంగనాథ్ ముందుటాడని ఆయన సేవలను కొనియాడారు. కాకర్ల రంగనాథ్ మాట్లాడుతూ మండల పరిధిలోని ఏ ప్రభుత్వ పాఠశాలలో ఐనా ఇలాంటి మౌలిక సదుపాయాలు కలిపించడంలో తన వంతు సాయం అందిస్తానని అన్నారు.

Body:కాకర్ల రంగనాథ్(కాకర్ల రంగనాథ్ సేవాసమితి అధ్యక్షుడు)

Conclusion:రిపోర్టర్: లక్ష్మీపతి నాయుడు
ప్లేస్: తాడిపత్రి, అనంతపురం
కిట్ నెంబర్: 759
7799077211
7093981598
Last Updated : Sep 12, 2019, 10:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.