హోం మంత్రి మేకతోటి సుచరితకు తెదేపా అధినేత చంద్రబాబును విమర్శించేంత స్థాయి లేదని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు విమర్శించారు. రాష్ట్రానికి హోం మంత్రి అన్న విషయం మర్చిపోయి... బాధ్యత లేని వ్యక్తి మాదిరి ఆమె మాట్లాడుతున్నారని అన్నారు.
రాజకీయాల్లో పొగడ్తలు, విమర్శలు రెండు ఉంటాయన్న ఆయన... ఈ రెండింటికీ సంస్కారవంతంగా సమాధానం ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు.