నో యాక్సిడెంట్ డే సందర్భంగా... కృష్ణా జిల్లా నూజివీడులోని శ్రీ శారద డిగ్రీ కళాశాల ఆవరణలో విద్యార్థులకు సీఐ రామచంద్రరావు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని వాహనాలను నడపాలన్నారు. సామర్ధ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని ఆటో డ్రైవర్లకు చెప్పారు. ప్రమాదాలు సంభవించకుండా విద్యార్థులు అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు.
ఇదీ చదవండి:పాముకాటుపై అవగాహన సదస్సు