కృష్ణా జిల్లా విజయవాడలో అధికార యంత్రాంగం, నగర పాలక సంస్థ అధికారులు కరోనాపై ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు వీరితో పాటు స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు, సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. విజయవాడలో రాష్ట్ర పెయింటింగ్ కళాకారులు, కార్మికుల సంఘం ఆధ్వర్యంలో పలు ప్రధాన కూడళ్లలో కొవిడ్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చిత్రాలు వేస్తున్నారు. కరోనా వైరస్ చిత్రాన్ని గీసి 'లాక్ డౌన్ పాటిద్దాం...కరోనాను తరిమికొడదాం' అనే నినాదాలు రాస్తున్నారు.
కరోనా వైరస్ నియంత్రణలో అనుక్షణం సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది, లాక్ డౌన్ కట్టుదిట్టంగా అమలుచేస్తున్న పోలీసులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ్య సిబ్బంది, ప్రచార సాధనాల ద్వారా అవగాహన కల్పిస్తున్న మీడియాకు కృతజ్ఞతలు చెబుతూ రహదారులపై బొమ్మలు వేస్తున్నారు. తమ వంతు బాధ్యతగా ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇలా పెయింటింగ్‌లు వేస్తున్నట్లు కార్మికుల సంఘం సభ్యులు తెలిపారు.
ఇవీ చదవండి:
కరోనాపై విస్తృత ప్రచారం.. రోడ్డుపై చిత్రాలతో ప్రయత్నం