ఇదీ చదవండి
'కేసీఆర్కు వైకాపా మద్దతు పలకడం సిగ్గుచేటు' - కృష్ణాజిల్లా గుడివాడ
తెలుగు తల్లిని, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న కేసీఆర్కు వైకాపా మద్దతు ఇవ్వడం సిగ్గుచేటని మండిపడ్డారు గుడివాడ తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్. గుడివాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. తెదేపా చేపట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
దేవినేని అవినాష్ ప్రచారం
కృష్ణాజిల్లా గుడివాడ తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్ ప్రచారం ముమ్మరం చేశారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. తెలుగు తల్లిని, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న కేసీఆర్కు వైకాపా మద్దతు ఇవ్వడం సిగ్గుచేటని మండిపడ్డారు. తెదేపా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మరో వైపు అవినాష్‌ను కుటుంబసభ్యుడిగా భావించి గెలిపించాలని సోదరి క్రాంతి ప్రచారం నిర్వహించారు.
ఇదీ చదవండి
sample description