కృష్ణాజిల్లా అవనిగడ్డ ఏపీఎస్ ఆర్టీసీ డిపోలో లో బస్సు కండక్టర్, డ్రైవర్లకు సెలవులు మంజూరు చేయటంలేదని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. డిపో మేనేజర్ తమపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 8గంటల డ్యూటీకి బదులు 14గంటలు చేయిస్తున్నారన్నారు. ఒకపక్క భరించలేని ఎండ, వడ గాలులకు తీవ్రంగా అనారోగ్యం పాలవుతున్నా సెలవులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనారోగ్యంతో ఉన్న సెలవు లేదు....
అనారోగ్యంతో ఉన్న తనకు సెలవు మంజూరు చేయమని కోరగా సెలవు ఇవ్వటం కుదరదని అధికారులు తెలిపారని మహిళా కండక్టర్ ఆరోపించింది. ఫిట్స్ వచ్చి అక్కడిక్కడే పడిపోయినా డిపో మేనేజరు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. మహిళలకు నెలవారి 3 రోజుల సెలవులు మంజూరు చేయటం లేదని తెలిపింది.
వరుస డ్యూటీలు మా వల్ల కాదు...
వరుస డ్యూటీలతో అనారోగ్యానికి గురవుతున్నామని... అనారోగ్యం వల్ల బస్సు నడపలేకపోతే ప్రయాణికుల పరిస్థితి ఏమిటని డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి కైనా ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి-జీవితపు అర్థాన్ని నేర్పిన నాన్నే నా హీరో...!