కొవిడ్ వాక్సిన్ సురక్షితమైందని అవనిగడ్డ సబ్ డివిజన్ డీఎస్పీ మెహబూబ్ బాషా అన్నారు. టీకా గురించి ఆందోళన చెందాల్సిన అవసపం లేదన్నారు. కొవిడ్ ఫ్రెంట్ లైన్ వారియర్స్ వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లా అవనిగడ్డలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 140 మంది పోలీస్ సిబ్బంది కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలో పోలీసు సిబ్బంది అందరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని, అపోహలతో భయాందోళనలకు గురికావద్దని డీఎస్పీ చెప్పారు.
ఇదీ చదవండి: 'ఇంటి వద్దకే రేషన్ అంటూ.. జనాలను నడిరోడ్డుపై నిలబెడుతున్నారు'