Non-bailable arrest warrant against Selvamani : మంత్రి రోజా భర్త ఆర్.కే. సెల్వమణిపై తమిళనాడులోని ఓ కోర్టు అరెస్టు వారంట్ జారీచేసింది. పరువు నష్టం కేసు (Defamation suit) లో కోర్టుకు హాజరు కావాల్సిన సెల్వం ఏ మాత్రం స్పందించలేదు.. పైగా ఆయన తరఫు న్యాయవాదులు కూడా కోర్టుకు సమాధానం ఇవ్వకపోవడం ఆగ్రహానికి కారణమైంది. ఈ నేపథ్యంలో కోర్టు.. సెల్వమణిపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ విషయంలో మంత్రి రోజా ఇప్పటి వరకు బహిరంగంగా స్పందించలేదు. కేసు వేసిన ముకుంద్‌చంద్ బోత్రా అనే వ్యక్తి మృతిచెందగా.. అతడి కుమారుడు గగన్‌బోత్రా కేసును కొనసాగిస్తుండడం గమనార్హం.
రాప్తాడు రాజకీయం.. దాడికి గురైన జగ్గుపైనే నాన్ బెయిలబుల్ కేసు
ఇద్దరిపై పరువు నష్టం కేసు.. పరువు నష్టం కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో డైరెక్టర్ ఆర్.కె.సెల్వమణిపై చెన్నై జార్జ్‌టౌన్ కోర్టు నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఏపీ పర్యాటక శాఖ మంత్రి, నటి రోజా (R.K.Roja) భర్త సెల్వమణి పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. 2016లో ఓ కేసులో ముకుంద్‌చంద్ బోత్రా అనే సినిమా ఫైనాన్షియర్ అరెస్టు కాగా.. ముకుంద్ (Mukund) కారణంగా తాను ఇబ్బందులకు గురయ్యానంటూ సెల్వమణి ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో సెల్వమణి చేసిన వ్యాఖ్యలతో తన పరువుకు భంగం కలిగిందని ముకుంద్ కేసు దాఖలు చేశారు. కేసు విచారణ కొనసాగుతున్న తరుణంలోనే ముకుంద్‌చంద్ బోత్రా కన్నుమూయగా.. ఆయన కుమారుడైన గగన్‌బోత్రా కేసును కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కేసు విచారణ సోమవారం జరిగినప్పటికీ సెల్వమణి హాజరుకాకపోవడంతో కోర్టు ఆగ్రహించింది. దీంతో బోద్రా... సెల్వమణితో పాటు అరుళ్ అనే మరో వ్యక్తిపైనా పరువు నష్టం దావా వేశారు
‘అమరావతి’ ఆందోళనకారులపై నాన్ బెయిలబుల్ కేసులు
సర్వత్రా చర్చ.. సెల్వమణి అంటే తమిళ సినిమా పరిశ్రమలో తెలియని వారుండరు. ఆయన దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ రికార్డులు నమోదు చేశాయి. చెన్నై జార్జ్‌టౌన్ కోర్టు (CHENNAI GEORGETOWN COURT) నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇచ్చిన నేపథ్యంలో సెల్వమణి తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే.. అదే ఏకైక మార్గం. నాన్ బెయిలబుల్ (Non-bailable) వారెంట్ జారీ కావడంతో సెల్వమణి.. కోర్టుకు హాజరవుతారా? లేక న్యాయవాది ద్వారా కోర్టును ఆశ్రయిస్తారా? అనేది చర్చనీయాంశమైంది.
కేసు వేసిన ఫైనాన్షియర్ ముకుంద్ బోత్రా మరణించగా, అతడి కుమారుడు గగన్ బోత్రా ఆ కేసును కొనసాగిస్తున్నారు. ఈ కేసు విచారణ సోమవారం చెన్నై జార్జ్‌టౌన్ కోర్టులో జరిగింది. సెల్వమణి హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి.. అతడిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ ఇష్యూ చేశారు. అతడి లాయర్లు కూడా కోర్టుకి వచ్చి సమాధానం చెప్పకపోవడంతో కోర్టు ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించింది. ఇదిలా ఉండగా వారంట్ విషయమై సెల్వమణి భార్య.. ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా ఇప్పటివరకు స్పందించలేదు.