ETV Bharat / state

రాష్ట్రమంతా ఆరోగ్యశ్రీ...ఉత్తర్వులు జారీ

ఆరోగ్యశ్రీ పథకం కింద అందిస్తున్న చికిత్సల సంఖ్యను పెంచటంతో పాటు అన్ని జిల్లాల్లోనూ వాటిని అమలు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం అందిస్తున్న 2200 చికిత్సలకు అదనంగా మరో 223 చికిత్సా విధానాలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. దీంతో పాటు బోన్ మ్యారో చికిత్సకు కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలిచ్చింది.

Arogyasri scheme
Arogyasri scheme
author img

By

Published : Nov 11, 2020, 10:06 PM IST

వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా 2200 చికిత్సలను రాష్ట్రవ్యాప్తంగా వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి 7 జిల్లాల్లో అమల్లో ఉన్న 887 చికిత్సా విధానాలను మిగతా ఆరు జిల్లాలకూ వర్తింపజేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో అన్ని జిల్లాల్లోనూ ఆరోగ్యశ్రీ కింద అందించే చికిత్సలను పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. నూతనంగా వచ్చి చేరిన 887 చికిత్సలు ఇకనుంచి శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలకూ వర్తింపజేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద అందిస్తున్న 2200 వైద్య చికిత్సలకు అదనంగా మరో 223 చికిత్సలను కూడా చేరుస్తూ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు బోన్ మారో చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేరుస్తూ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లోని ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లోనూ ఈ బోన్ మ్యారో చికిత్స అందించనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.

2020 నవంబరు 10 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఈ వైద్య విధానాలను అమలు చేయాల్సిందిగా వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.

ఇదీ చదవండి

ఎమ్మెల్యేల ఆగడాలను ఆపేదెవరు..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.