ETV Bharat / state

'ఆరోగ్యమిత్ర'లకు అన్నీ సమస్యలే! వేతన వెతలకు తోడు కొరవడిన ఉద్యోగ భద్రత - Arogyamithra employees problems in ap

Arogyamithra Job Problems: చాలీ చాలని వేతనంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆరోగ్యమిత్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నా క్రమబద్ధీకరించడంలేదని వాపోతున్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని ఆరోగ్యమిత్రలు కోరుతున్నారు.

Arogyamithra_Job_Problems
Arogyamithra_Job_Problems
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 6, 2023, 10:50 AM IST

Arogyamithra Job Problems: తమ ప్రభుత్వం వస్తే ఆరోగ్యమిత్రలను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం జగన్ గతంలో మాట ఇచ్చారు. ప్రభుత్వం వచ్చి నాలుగున్నరేళ్లు గడిచినా వారి జీవితాల్లో వెలుగులు లేవు. వారి సమస్యలు పరిష్కారం కాలేదు. తమకు కొంత జీతం పెంచి.. ప్రభుత్వ పథకాలు అన్నీ కట్ చేశారని ఆరోగ్యమిత్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 వేల రూపాయల వేతనంతో కుటుంబ భారాన్ని మోయలేక నరకయాతన అనుభవిస్తున్నారు. 15 ఏళ్ల నుంచి ఉద్యోగం చేసినా అవుట్ సోర్సింగ్​లోనే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని ఆరోగ్యమిత్రలు డిమాండ్ చేస్తున్నారు.

రోగులను సరైన ఆస్పత్రికి పంపించే బాధ్యత ఆరోగ్యమిత్రదే: సీఎం

Arogyamithra Employees Problems in AP: ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకంలో ఉచితంగా వైద్య సేవలు అందించే ప్రక్రియలో ఆరోగ్యమిత్రలు కీలక వ్యక్తులు. కానీ, వారి కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యమొస్తే డబ్బు ఖర్చు పెట్టి వైద్య చికిత్స చేయించుకోవాల్సిందే. 15 ఏళ్ల నుంచి అవుట్ సోర్సింగ్​లో ఉద్యోగం చేస్తున్న తమకు 15 వేల రూపాయలు వేతనం వస్తోందని, ఈ చాలీ చాలని జీతంతో కుటుంబ నిర్వహణ భారంగా మారుతోందని ఆరోగ్యమిత్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ సమస్యల పరిష్కారానికి విజయవాడలో రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు ఆరోగ్య మిత్రలు.

రాష్ట్ర వ్యాప్తంగా 2,000 మంది ఆరోగ్యమిత్రలుగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్​లో పనిచేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేతనాలు పెంచింది. కానీ.. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్, తెల్లరేషన్ కార్డ్, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి లాంటి పథకాలు నిలిపివేసింది. దీంతో ప్రభుత్వం ఇచ్చే 15 వేల రూపాయల జీతంపైనే కుటుంబాన్ని నడపాల్సి వస్తోందని ఆరోగ్యమిత్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆరోగ్యమిత్రల పోస్టుల భర్తీకి ఉత్తర్వులు

Employees Problems in AP: ప్రస్తుతం సీఎం జగన్.. గతంలో ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు తాను అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అయితే మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్నా.. ఇంత వరకు ఏ ఒక్క సమస్య కూడా తీరలేదని ఆరోగ్య మిత్రలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించి, ఏళ్ల తరబడి అవుట్ సోర్సింగ్​లో పనిచేస్తుంటే.. ప్రభుత్వం కేడర్ నిర్ణయించలేదని.. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పరిగణించకపోవటం దారుణమని పేర్కొన్నారు.

ఇతర ఉద్యోగాల నోటిఫికేషన్​ల్లో తమకు వెయిటేజీ ఇవ్వట్లేదని బాధను వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 28ని సవరించి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆరోగ్యమిత్రలు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని ఆరోగ్యమిత్రలు కోరుతున్నారు. దీంతోపాటు పనిభారం పెరుగుతోందని.. అదనంగా నియామకాలు జరపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

చాలీ చాలని వేతనంతో పిల్లలను చదివించుకోలేక నరకయాతన అనుభవిస్తున్నామని చెప్తూ.. తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డిని కోరారు. ఆరోగ్యమిత్రలు అడుగుతున్నవి న్యాయమైన కోర్కెలేనని, ప్రభుత్వంతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెంకట్రామిరెడ్డి తెలిపారు.

Anganwadi Workers Arrest: అంగన్​వాడీల మహాధర్నా.. ఈడ్చుకెళ్లి వ్యాన్​లో పడేసిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.