ETV Bharat / state

చలో సచివాలయం: నేతల ముందస్తు అరెస్టులు - ఉపాధ్యాయుల అరెస్టులు

చలో సచివాలయంకు పిలుపునిచ్చిన ఉపాధ్యాయ సంఘాల నేతలు, ముఖ్య నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తుగా పోస్టులను బ్లాక్ చేసి, ఉపాధ్యాయులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అరెస్టులు చేసినా తమ ఆందోళనలు ఆగవని నేతలు స్పష్టం చేశారు.

leaders house arrests
నేతల ముందస్తు అరెస్టులు
author img

By

Published : Dec 16, 2020, 12:33 PM IST

ఉపాధ్యాయ బదిలీలు సక్రమంగా చేపట్టాలంటూ చలో సచివాలయంకు పిలుపునిచ్చిన ఉపాధ్యాయ సంఘాల నేతలను వివిధ ప్రాంతాల్లో ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ యూటీఎఫ్, ఏపీటీఎఫ్ కార్యాలయం నుంచి బయలుదేరిన బాపిరెడ్డితో పాటు పది మంది నాయకులను అరెస్టు చేశారు. ఉపధ్యాయ బదిలీలలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించటం లేదని యూటీఎఫ్ నాయకులు బాపిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తుగా పోస్టులు బ్లాక్ చేసి ఉపాధ్యాయులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఉపాధ్యాయుల వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని రద్దు చేసి, మాన్యూవల్​గా నిర్వహించాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ధ్వజమెత్తారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. తమని అరెస్టు చేసినా ఆందోళనలు ఆగవని స్పష్టం చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ జోక్యం చేసుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

" మెుత్తం ఎన్ని పోస్టులు, ఎలా భర్తీ చేస్తున్నారో ఎందుకు చెప్పటం లేదు? మూడేళ్లుగా బదిలీల కోసం ఎదురు చేస్తున్న ఉపాధ్యాయులను ప్రభుత్వం మోసం చేస్తోంది." - బాబురెడ్డి యూటీఎఫ్ నాయకులు.

ఇదీ చదవండి: 'అమరావతి కోసం రాష్ట్ర ప్రజలందరూ పోరాడాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.