ఇవీ చదవండి: మద్యం ప్రియులను 'ఏప్రిల్ ఫూల్స్' చేసిన వైన్ షాపు
అవనిగడ్డలో లాక్‌డౌన్ కట్టుదిట్టం: సేవలందిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు - apsrtc employees helps to police in avanigadda latest
కరోనా వ్యాప్తి దృష్ట్యా అమలు చేస్తున్న లాక్డౌన్ను అవనిగడ్డ పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. వీరికి తోడుగా ఆర్టీసీ సిబ్బంది సేవలందించేందుకు ముందుకొచ్చారు.
apsrtc-employees
కరోనా వ్యాప్తి కారణంగా అమలు చేస్తున్న లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల సేవలను వినియోగించుకుంటున్నట్లు అవనిగడ్డ డీఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు. వాలంటీర్లుగా సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన 111 మంది ఆర్టీసీ ఉద్యోగులకు.. మాస్కులు, గ్లౌజులు పంపిణీ చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య నిర్మించిన పులిగడ్డ వారధి నుంచి రేపల్లెకి ఎమర్జెన్సీ కేసులను పంపించేందుకు వీలుగా పోలీసులు... ఇంటర్ డిస్ట్రిక్ కో ఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి: మద్యం ప్రియులను 'ఏప్రిల్ ఫూల్స్' చేసిన వైన్ షాపు