ETV Bharat / state

నదీ జలాల వివాదం: నేడు అపెక్స్ కౌన్సిల్ కీలక సమావేశం - సీఎం కేసీఆర్ వార్తలు​

జలవివాదాలపై తెలుగురాష్ట్రాలు తమ వాదనతో అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీకీ సిద్ధమయ్యాయి. రాష్ట్ర పునర్విభజనచట్టం ప్రకారం నీటి కేటాయింపుల విషయంలో....ఎలాంటి రాజీ ధోరణికీ ఆస్కారం లేకుండా ప్రయత్నాలు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. గోదావరి-కృష్ణా బేసిన్‌లో రాష్ట్రానికి దక్కాల్సిన నీటి విషయంలో గట్టిగానే వ్యవహరించాలని సీఎం జగన్‌ నిర్ణయించారు.

apex council
apex council
author img

By

Published : Oct 6, 2020, 12:14 AM IST

Updated : Oct 6, 2020, 5:39 AM IST

కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో తన వైఖరిని స్పష్టంగా తెలియజెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో..రాష్ట్రం తరఫున సీఎం జగన్‌, జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌..అధికారులతో కలిసి దిల్లీలోని ఏపీ భవన్ నుంచి హాజరు కానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..హైదరాబాద్‌ నుంచే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొంటారు.

ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ లేదు

ఆంధ్రప్రదేశ్‌కు నీటికేటాయింపుల విషయంలో..రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో స్పష్టమైన ఆదేశాలు రాబట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గోదావరి-కృష్ణా బేసిన్‌లోని నీటి వాటాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండకూడదని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇటీవల కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వ్యవహారంతో పాటు అపెక్స్ కౌన్సిల్ సమావేశంపై స్పందన లేదంటూ కేంద్రం రాసిన లేఖపైనా రాష్ట్ర ప్రభుత్వం ఘాటుగానే స్పందించింది. కృష్ణా జలాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని ఇరిగేషన్‌ శాఖకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కృష్ణా జలాల వినియోగం విషయంలో ఏపీ తనకు చెందిన నీటి వాటానే వినియోగించుకుంటున్నా..కేఆర్​ఎంబీ వివక్షతో వ్యవహరిస్తోందని ఈ అంశాన్ని అపెక్స్‌ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించాలని భావిస్తోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ నీటిని విడుదల చేస్తున్న కారణంగా.... రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తాగునీరు సరఫరా చేయలేమని..ఇదే విషయాన్ని చెబుతున్నా..కేఆర్​ఎంబీ ఉదాసీనంగా ఉండటంపై రాష్ట్రప్రభుత్వం పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది. అపెక్స్ కౌన్సిల్‌ సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ అభ్యంతరాలకు గట్టిగానే సమాధానం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. రాయలసీమకు 144 టీఎంసీల నీటి కేటాయింపుపై 2015లో జరిగిన కేఆర్​ఎంబీ సమావేశంలోనే తెలంగాణ తన అంగీకారాన్ని తెలిపినట్లు జలవనరుల శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై మొదటి అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలోనే తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా అంగీకారం తెలిపారని ప్రభుత్వం చెబుతోంది. ఈ ఆధారాలనే రెండో అపెక్స్ కౌన్సిల్‌ సమావేశంలో సమర్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కేటాయింపుల ఆధారంగానే

పునర్విభజన చట్టం ప్రకారం.. రాయలసీమ ఎత్తిపోతల కొత్త ప్రాజెక్టు కాదని.. పాతవాటికి కొనసాగింపు మాత్రమేనని తేల్చి చెప్పనున్నారు. అదనంగా నీటి మళ్లింపు, నీటి నిల్వ, కొత్త ఆయకట్టు లేదని స్పష్టం చేయనున్నారు. దీనికి సంబంధించి ఇటీవల కేంద్రం.. జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు ఇచ్చిన అఫిడవిట్‌ను కూడా ఏపీ ప్రస్తావించనుంది. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా ఏపీకి కేటాయించిన నీటి వాటాను సమర్థంగా వాడుకోవడానికి మాత్రమే నిర్మాణం చేపడున్నామని..ఇది కొత్త ఆయకట్టును తీసుకురావడం లేదని స్పష్టం చేయనున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి కాల్వల ద్వారా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కేటాయింపుల ఆధారంగానే వినియోగం ఉంటోందని.. ఏపీ వాదన వినిపించనుంది. 854 అడుగుల కన్నా దిగువన నీటిని ఎత్తిపోసేందుకు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నామని..రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల దాహార్తి కూడా ఈ ప్రాజెక్టుతో తీరుతుందని సీఎం వివరించనున్నారు.

తెలంగాణ కొత్త ప్రాజెక్టులపై వివరణ

గోదావరి బేసిన్‌లో తెలంగాణ చేపట్టిన కొత్త ప్రాజెక్టుల కారణంగా రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని సీఎం ప్రస్తావించనున్నట్లు సమాచారం. అపెక్స్ కౌన్సిల్‌ మొదటి భేటీలో కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌ ఇచ్చిన నీటి వాటాకు బద్ధులై ఉంటామని చెప్పిన తెలంగాణ ..కొత్త ప్రాజెక్టులు చేపట్టిందని..వీటిని నిలుపుదల చేయాల్సిందిగా అపెక్స్‌ కౌన్సిల్‌ ఆదేశించలేదని వివరించనున్నట్లు తెలుస్తోంది. గోదావరి బేసిన్‌లో గోదావరి నదీ యాజమాన్య బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ ఆదేశాలు లేకుండానే కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని సీఎం జగన్‌ ప్రస్తావించనున్నారు. ఈ ప్రాజెక్టులన్నీ ఏపీ ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావం చూపేలా ఉన్నాయని..నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌, జూరాల, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నీటిని తెలంగాణ తరలించుకుంటోందని ముఖ్యమంత్రి జగన్ వివరించే అవకాశం ఉంది.

నాగార్జునసాగర్‌తో పాటు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణనూ తమకే అప్పగించాలన్నది తెలంగాణ వాదన. బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయకుండా.. పరిధిని నోటిఫై చేయాల్సిన అవసరం లేదన్నది తెలంగాణ చెబుతోంది. పోతిరెడ్డిపాడు నుంచి నీటి మళ్లింపు, రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణాలపై తెలంగాణకు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అంతర్రాష్ట్ర జలవివాద చట్టం-1956లోని సెక్షన్‌-3 ప్రకారం కృష్ణా జలాలపై విచారణ జరపాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది.

ఇదీచదవండి

ఆ వ్యత్యాసాలు సవరించి రాష్ట్రాలకు ఎక్కువ నిధులివ్వాలి: బుగ్గన

Last Updated : Oct 6, 2020, 5:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.