రాష్ట్రానికి దక్కిన వరం పోలవరం ప్రాజెక్టు అని.. ఏపీసీసీ ఉపాధ్యక్షులు తులసి రెడ్డి అన్నారు. విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వమే ప్రాజెక్టును పూర్తి చేస్తుందని నాటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారని గుర్తుచేశారు. దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు మారి ప్రాజెక్టు వెనుకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భాజపా ప్రభుత్వం చట్టప్రకారం పోలవరం పూర్తి చేయకుండా రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కాసుల కోసం కక్కుర్తితో పోలవరం బాధ్యతలు తమ నెత్తిపై వేసుకున్నాయని ఆరోపించారు. విభజన చట్టం సెక్షన్ 90 ద్వారా కేంద్ర ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టును ఆధీనంలోకి తీసుకుని ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి