ETV Bharat / state

దేవరలంకలో 'నాగదేవత' ప్రత్యక్షం! - పుట్టలో గుడ్లను ఆరగిస్తుండగా వీడియో

నాగులచవితి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు - పుట్టలో పాలు పోసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు

nagula_chavithi_celebrations_in_andhra_pradesh
nagula_chavithi_celebrations_in_andhra_pradesh (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Nagula Chavithi Celebrations in Andhra Pradesh : నాగులచవితి పర్వదినాన్నిరాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. పుట్టల వద్దకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకుని పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు చేశారు. కొబ్బరికాయలు కొట్టి, హారతులు సమర్పించారు. పుట్టలో పాలు పోసి భక్తులు పూజలు చేశారు. విశాఖ జూపార్క్‌లోని పుట్ట వద్దకు ఉదయం నుంచి భక్తులను అధికారులు అనుమతులిచ్చారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం దేవర లంకలో పాము గుడ్డుని ఆరగించింది. భక్తులు పెట్టిన గుడ్డును పాము మింగుతుండగా పలువురు వీడియో తీశారు. అది కాస్తా ఇప్పుడు నెట్టింట్లో వైరల్​ అయ్యింది.

భక్తులు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పల్లెలు, పట్టణాల్లో ప్రజలు ఉదయాన్నే ఉపవాస దీక్షలతో పుట్టల వద్ద చలిమిడి, చిమ్ని, కోడిగుడ్లు, పాలు, పానకం, వడపప్పు తదితర పదార్థాలు నాగదేవతకు నివేదించి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం బాణసంచా కాల్చి సందడి చేశారు.

పామాయిల్​ తోటలో 12 అడుగుల కింగ్​ కోబ్రా - రైతన్నల ఆందోళన

విజయవాడ మధురానగర్‌లోని బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నాగుల చవితి వేడుకలు వైభవంగా నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. అయ్యప్పనగర్‌లోని సుబ్రమణ్యస్వామి దేవాలయంలో వందేళ్ల చరిత్ర ఉన్న రావి, జువ్వి, జమ్మి చెట్ల వద్ద ఉన్న పుట్టలో భక్తులు పాలు పోసి, దీపారాధన పూజలు నిర్వహించారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరంలోని 150 ఏళ్ల చరిత్ర కలిగిన లక్ష్మీ నారాయణ సహిత శ్రీ నాగేంద్ర స్వామి వార్ల దేవస్థానంలో నాగులచవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడులోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో శృంగేరి పీఠం ఆధ్వర్యంలో నాగులచవితి వేడుకలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలకు పాలు పోసి, నైవేద్యాలు చెల్లించారు. చిన్నారులు తలనీలాలు సమర్పించారు. మహిళలు దీపారాధన చేశారు.

తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం, నిడదవోలులోని ఆలయాల్లో పుట్టల వద్ద పాలు, గుడ్లు వేసి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. విశాఖలో పలుచోట్ల సహజసిద్ధంగా ఏర్పడిన పుట్టల వద్ద భక్తులు సందడి చేశారు. భక్తిశ్రద్ధలతో నాగేంద్రుడిని కొలిచి చలివిడి సమర్పించారు.

వంటింట్లో నుంచి వింత శబ్ధం - పరిశీలించి చూస్తే షాక్​ - Snake Halchal in House in Muramalla

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.