ETV Bharat / state

ఆంధ్రా అల్లుడే అమెరికా ఉపాధ్యక్షుడు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ హవా - ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ భార్య ఉష తెలుగు సంతతి మహిళ

us_election_updates
us_election_updates (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 6, 2024, 1:30 PM IST

Updated : Nov 6, 2024, 2:20 PM IST

US Election updates : అమెరికా ఎన్నికలో రిపబ్లిక్ పార్టీ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలుగు వారి అల్లుడే. రిపబ్లిక్ పార్టీ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ఉష తెలుగు సంతతికి చెందిన వారే కావడం విశేషం. ఉషా చిలుకూరి విశాఖ వాసులకు బంధువు. గతేడాది వరకూ విశాఖలో సుపరిచిత సెంచూరియన్, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్​గా సేవలు అందించిన శాంతమ్మ మనుమరాలు ఉషా చిలుకూరి. అమెరికా ఉపాధ్యక్షుడిగా రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి జేడీ వాన్స్‌ ఎన్నికైన నేపథ్యంలో ఆయన భార్య ఉషా చిలుకూరి పేరు ఒక్కసారిగా మళ్లీ మార్మోగిపోతోంది. ఉషకు విశాఖపట్నంలో బంధువులు ఉన్నారు. 90ఏళ్ల వయస్సులోనూ విద్యార్థులకు పాఠాలు చెప్పడంతోపాటు పరిశోధనలు చేస్తున్న ప్రొఫెసర్‌ శాంతమ్మకు ఉష మనవరాలి వరుస అవుతారు. తెలుగు ప్రొఫెసర్‌గా పనిచేసిన శాంతమ్మ భర్త చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి కొన్నేళ్ల కిందట మృతి చెందారు. సుబ్రహ్మణ్యశాస్త్రి సోదరుడు రామశాస్త్రి కుమారుడైన రాధాకృష్ణ కుమార్తే ఉష.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తెలుగోళ్ల డిమాండ్లు- ఎవరు గెలిచినా ఆ పనులు చేయాల్సిందేనట!

జేడీ వాన్స్‌ను అమెరికా ఉపాధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ ఎంపిక చేయడంపై శాంతమ్మ సంతోషం వ్యక్తం చేశారు. ఉష తల్లిదండ్రులు ఎప్పుడో అమెరికాలో స్థిరపడ్డారని ఆమె అక్కడే పుట్టి పెరగిన నేపథ్యంలో అంతగా పరిచయం లేదన్నారు. వాన్స్‌ అభ్యర్థిత్వం, తమ బంధుత్వం గురించి తెలిశాక పలువురు ఫోన్‌లో అభినందనలు తెలిపారని శాంతమ్మ వెల్లడించారు. చెన్నైలో వైద్యురాలిగా పనిచేస్తున్న ఉష మేనత్త శారద ఉష, వాన్స్ వివాహానికి సైతం హాజరైనట్లు గుర్తు చేసుకున్నారు. మా బంధువులు ఎందరో అమెరికాలో వివిధ సంస్థల్లో ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నారని చెప్తూ అందులో ఉష దంపతులు ఈ స్థాయికి వెళ్లారని తెలియగానే గర్వంగా అనిపించిందని పేర్కొన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడి భార్య అయితే ఎక్కువ, లేకపోతే తక్కువ అని కాకుండా తమ ఆశీస్సులు వారికి ఎప్పుడూ ఉంటాయి అని శాంతమ్మ తెలిపారు.

కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామం ఉషా చిలుకూరి పూర్వీకుల స్వగ్రామం. ఉషకు తాత వరుస అయిన రామ్మోహనరావు కుటుంబం ప్రస్తుతం ఇక్కడే నివాసం ఉంటుండగా వారి వంశవృక్ష పటం లభ్యమైంది. ఉష పూర్వీకులు దశాబ్దాల కిందటే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోగా సాయిపురంలో 18వ శతాబ్దంలో చిలుకూరి బుచ్చిపాపయ్య శాస్త్రి నివసించారు. ఆయన సంతానమే శాఖోపశాఖలుగా ఉష వరకు విస్తరించింది. ఆమె ముత్తాత వీరావధాన్లుకు ఐదుగురు సంతానం. రామశాస్త్రి, సూర్యనారాయణ శాస్త్రి, సుబ్రహ్మణ్యశాస్త్రి, వెంకటేశ్వర్లు, గోపాలకృష్ణమూర్తి అందరూ ఉన్నత విద్యావంతులే.

రామశాస్త్రి మద్రాసు వలస వెళ్లిపోయి ఐఐటీ మద్రాసులో ప్రొఫెసర్గా పనిచేశారు. ఆయన భార్య బాలాత్రిపుర సుందరి కాగా, వీరికి అవధాని, నారాయణశాస్త్రి, రాధాకృష్ణ అనే ముగ్గురు కుమారులున్నారు. శారద ఒక్కగానొక్కు కుమార్తె. ముగ్గురు కుమారులూ అమెరికాలో స్థిరపడగా శారద మాత్రం చెన్నైలో నివాసం ఉంటూ వైద్యురాలిగా స్థిరపడ్డారు. ఏరో నాటికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన రాధాకృష్ణ శాన్‌డియాగో విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. పామర్రుకు చెందిన లక్ష్మితో ఆయనకు వివాహం కాగా వారి సంతానమే ఉష. ఉష తాత రామశాస్త్రి చిన్న సోదరుడు గోపాలకృష్ణమూర్తి తాను తోడల్లుళ్లం అవుతామనీ సాయిపురానికి చెందిన రామ్మోహనరావు తెలిపారు. ఒక ఇంటి ఆడపడుచులనే తాము వివాహం చేసుకున్నామని చెప్తూ ఇటీవల వంశవృక్షం రూపొందించామని వివరించారు.

ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ- ఫైనల్ ట్రెండ్ ఎలా ఉంటుందంటే!

'మత వ్యతిరేక అజెండా నుంచి రక్షిస్తా'- హిందూ ఓటర్లపై డొనాల్డ్‌ ట్రంప్‌ గురి! ఇండో-అమెరికన్ల మద్దతు అయ​నకే!

Last Updated : Nov 6, 2024, 2:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.