అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో ఈఎఫ్ఎమ్ ఆధ్వర్యంలో డ్యాన్స్ ఈవెంట్ నిర్వహించారు. ట్రెండ్ సెట్ మాల్ లో నిర్వహిస్తున్న సమ్మర్ కార్నివాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారులు స్టెప్పులతో అదరగొట్టారు. వెస్ట్రన్ పాటలతో పాటు శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో అలరించారు. ఈఎఫ్ఎమ్ మీడియా పార్ట్నర్గా చేపట్టిన డ్యాన్స్ ఈవెంట్లో వ్యాఖ్యాతలుగా ఈఎఫ్ఎమ్ రేడియో జాకీలు లోక్షితా, సంజు సందడి చేశారు. న్యాయనిర్ణేతగా 'ఢీ' ఫేమ్ హరనాథ్ రెడ్డి వ్యవహించారు.
ఇవీ చదవండి
వర్షాలతో పాటు...ఉష్ణోగ్రతలు పెరిగె అవకాశం: కెఎల్ వర్శటీ ప్రోఫెసర్